అలగనూరు రిజర్వాయర్‌కు మోక్షం కల్పించండి..
అలగనూరు రిజర్వాయర్‌కు మోక్షం కల్పించండి..
అన్నదాతను ఆదుకోండి..
మరమ్మతులకు నిధులు విడుదల చేయండి..
జలవనరుల శాఖ మంత్రికి నంద్యాల జిల్లా సిపిఐ నాయకులు వినతి పత్రం..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని భూగర్భ జలాల ఎండిపోకుండా రైతులను ఆదుకునేందుకు మత్స్యకారుల కుటుంబాలు బాగుపడేందుకు నంద్యాల జిల్లా అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు గురువారం జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కు వినతి పత్రాన్ని అందజేశారు. గెలవనుర్ల శాఖ మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో రైతులకు జీవనాధారమైన అలగనూరు రిజర్వాయర్ ఏర్పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయడానికి 34 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.

జిల్లాలోని గడివేముల బూజునూరు కొరటమద్ది కొర్రపోలురు నందికొట్కూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు ఎస్ఆర్ బి సి కాలువ సాగునీటి స్థిరీకరణకై 3 టీఎంసీల సామర్థ్యంతో అలగనూరు రిజర్వాయర్ ను శంకుస్థాపన చేశారన్నారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు. 2017లో రిజర్వాయర్ కు పడిన గండిని పూడ్చేందుకు 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 3 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో సిద్ధమైందన్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్లక్ష్యం చేశా రన్నారు.
ఆ ప్రాజెక్టు గండి పూర్చడానికి వ్యయం పెరిగి అది నేటికీ 34 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఆ మేరకు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారన్నారు. అనేక సంవత్సరాలుగా రిజర్వాయర్ కు గండిపడడం వల్ల నీటిని నిలువ చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తిరిగి ఈ ప్రభుత్వంలోనైనా రిజర్వాయర్ గండిని పూడ్చడం వల్ల ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలకు త్రాగునీటి సమస్య తీరుతుంది అన్న రు. రిజర్వాయర్ నిండటం వల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల భూముల్లో భూగర్భ జలాలు పెరిగి బోర్ల ద్వారా రైతుల కు వ్యవసాయం కు ఉపయోగపడటం తో పాటు 150 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందన్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని వారు కోరారు.రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సా నుకూలంగా స్పందించి తప్పకుండా రిజర్వాయర్ గండిని పూడ్చి మరమ్మతులుచేపట్టెందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గిడ్డయ్య, నక్కి లెనిన్ బాబు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
