పాన్ ఇండియన్ మూవీ సాహో
తో దక్షిణాదికి పరిచయమైంది శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ అందచందాలు, డీసెంట్ పెర్ఫామెన్స్ యూత్ ని ఆకర్షించాయి. బాలీవుడ్ లో బిజీ నాయికగా కెరీర్ ని కొనసాగిస్తున్న శ్రద్ధా ఇటీవలే ఎన్టీఆర్ – హృతిక్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2
లో ప్రత్యేక గీతంలో నర్తించేందుకు అంగీకరించిందని కథనాలొచ్చాయి. బన్ని పుష్ప 2
లో ఆఫర్ ని కాదనుకున్నా ఎన్టీఆర్ సినిమాపై ఆసక్తిని కనబరచడంపై ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే శ్రద్ధా కపూర్ హాట్ ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ప్రఖ్యాత ది నాడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై శ్రద్ధా లుక్ ఇప్పుడు యూత్ లో హాట్ టాపిగ్గా మారింది. శ్రద్ధా కపూర్ స్టైలిష్ , స్పైసీ అవతార్ లతో మతులు చెడగొట్టింది.
అంతేకాదు శ్రద్ధా మునుపెన్నడూ కనిపించనంత రెబల్ గా కనిపించిందని యూత్ కామెంట్ చేస్తున్నారు. ది నాడ్ ఫోటోషూట్ కోసం తెలుపు రంగు ఉన్నితో తయారు చేసిన టాప్‌ను ధరించిన శ్రద్ధా, ఆస్కార్ డి లా రెంటా అల్మారాల నుండి వన్-సైడ్ స్లీవ్లను ఎంపిక చేసుకుంది.
తన లుక్‌ను బ్లాక్ లెదర్ షార్ట్స్ తో మ్యాచ్ చేసింది. మ్యాచింగ్ బ్లాక్ బూట్లు- చైన్ నెక్లెస్‌తో లుక్ ని యాక్సెసరైజ్ చేసింది. మినిమమ్ మేకప్ శ్రద్ధాలో హాట్ కంటెంట్ ని రెట్టింపు చేసింది.









