Ritu Varma | చీర‌క‌ట్టులో ముద్ద మందారం…

తెలుగు, తమిళ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి రీతు వర్మ. షార్ట్ ఫిల్మ్‌లుతో నటనలో కెరీర్ మొదలు పెట్టింది. మొదట సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈమె.. తన అద్భుతమైన నటనతో కథానాయకిగా ఎదిగింది. ఈ వయ్యారి పక్క తెలుగమ్మాయి. ఈ నటనకి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సినిమాల్లో ఆమె నటనకి అవార్డ్స్ కూడా అందుకుంది.

ఆమె మొదటి చిత్రం బాద్షా, ఇందులో ఆమె పింకీ అనే సహాయక పాత్రను పోషించింది. తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్‌లో ఆమె శ్రీ విష్ణు సరసన కాస్ట్యూమ్ డిజైనర్ పాత్రను పోషించింది. ఆ తరువాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రమణ్యంలో కనిపించింది. 2016 పెళ్లి చూపులు చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.

ఈ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు, సౌత్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తర్వత కేశవ, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 2024లో స్వాగ్ అనే సినిమాలో ఆకట్టుకుంది.

ప్రస్తుతం మజకాలో నటిస్తుంది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రితూ చీర‌క‌ట్టులో ఉన్న ఫోటోల‌ను పోస్ట్ చేసింది.. వెన్నెల్లో ఆడ‌పిల్ల అంటూ ఆభిమానులు ఈ ఫోటోల‌ను చూసి మురిసిపోతున్నారు..

Leave a Reply