Rs.5 crore | రూ.5 కోట్లు మంజూరు…

Rs.5 crore | రూ.5 కోట్లు మంజూరు…

  • ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి….

Rs.5 crore | ఆర్మూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.5 కోట్లు(Rs.5 crore) మంజూరు చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన మున్సిపల్ ఆఫీస్ కు రూ. 5 కోట్లు మంజూరు చేయాలని, ఇతర సమస్యలను సీఎం వివరించి మెమోరండం ఇవ్వగా సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

మున్సిపల్ బిల్డింగ్(Municipal Building) భూమి పూజ, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆర్మూర్ నియోజకవర్గానికి త్వరలో వస్తానని సీఎం తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ బిల్డింగ్ కు రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply