Paddy Purchase | కర్నూలు జిల్లాలో కందుల కొనుగోళ్లు…

Paddy Purchase | కర్నూలు జిల్లాలో కందుల కొనుగోళ్లు…

  • రైతులకు గిట్టుబాటు ధర దిశగా ప్రభుత్వ చర్య.

Paddy Purchase | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో కందుల సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ నుండి కందుల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు అధికారికంగా తెలియజేయడమైనది. ఈ కొనుగోలు ప్రక్రియలో ఎన్ సి సి ఎఫ్ కేంద్ర కొనుగోలు(purchase) సంస్థగా వ్యవహరించనుంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) రూ.8,000/- ప్రతీ క్వింటాల్‌కు కందుల కొనుగోళ్లు నిర్వహించనున్నారు.

గతంలో మార్కెట్‌లో ధరల ఊగిసలాటతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన కందులకు మద్దతు ధర లభించడం రైతుల(farmers) ఆర్థిక స్థితిని నిలబెట్టే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. నాణ్యతపై కఠిన నిబంధనలు అయితే, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కందులకే MSP రేటుకు కొనుగోలు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

కందులలో తేమ శాతం తప్పనిసరిగా 12 శాతం లోపు ఉండాలి. తేమ శాతం అధికంగా ఉన్న కందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పారు. రైతులు కందులను బాగా ఎండబెట్టి, మట్టి, చెత్త, తడి గింజలు లేకుండా పరిశుభ్రంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాల్సిందిగా సూచించడమైనది. ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు పాటించని కందులను తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Paddy Purchase | CM యాప్ నమోదు తప్పనిసరి..

కందుల విక్రయానికి సంబంధించి మరో కీలక నిబంధనగా CM యాప్‌లో నమోదు తప్పనిసరి చేశారు. రైతులందరూ తమకు సంబంధించిన రైతు సేవా కేంద్రం (RSK) ద్వారా CM యాప్‌లో నమోదు చేసుకున్న తరువాతనే కందుల విక్రయం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

CM యాప్‌లో నమోదైన రైతుల నుంచే కందుల కొనుగోలు జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 5,379 మంది రైతులు CM యాప్‌లో కందుల నమోదును పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన రైతులు కూడా ఆలస్యం చేయకుండా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Paddy Purchase | నేరుగా రైతు ఖాతాలోకి చెల్లింపులు..

కొనుగోలు చేసిన కందుల విలువను DBT విధానంలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. మధ్యవర్తుల జోక్యం లేకుండా, పారదర్శకంగా చెల్లింపులు జరగడం వల్ల రైతులకు పూర్తి లాభం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. రైతులకు అవగాహన అవసరం కందుల కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు కీలకమైనందున, రైతులు ముందుగానే పంటను శుద్ధి చేసుకుని, తేమ శాతం తగ్గించి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

లేకపోతే కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే, కర్నూలు జిల్లాలో కందుల కొనుగోళ్ల ప్రారంభం రైతులకు ఆశాజనక పరిణామంగా మారింది. అయితే, నాణ్యత ప్రమాణాలు – సిఎం యాప్ నమోదు – తేమ శాతం నియంత్రణ వంటి అంశాలపై రైతులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే ఈ ప్రభుత్వ నిర్ణయం పూర్తి స్థాయిలో ఫలితాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Paddy Purchase | కందుల కొనుగోళ్లు – కాగితాలకే పరిమితమవుతాయా?

కర్నూలు జిల్లా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీ నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కనీస మద్దతు ధరగా ప్రతీ క్వింటాల్‌కు రూ.8,000 నిర్ణయించడం మొదటి చూపులో ఆశాజనకంగానే కనిపిస్తోంది. కానీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ప్రకటన రైతుకు నిజంగా ఎంత మేరకు ఉపయోగపడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Paddy Purchase | ధర ఉంది… కానీ చేరుతుందా?

ఎంఎస్‌పీ ప్రకటించడమే గిట్టుబాటు ధర కాదు. ఆ ధర రైతు చేతికి చేరినప్పుడే అది అర్థవంతం అవుతుంది. గతంలోనూ పలు పంటలకు మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ, నాణ్యత నిబంధనలు, కొనుగోలు కేంద్రాల కొరత, సాంకేతిక అడ్డంకులు రైతులను మార్కెట్ దళారుల వద్దకే నెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈసారి కందుల విషయంలో ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.

Paddy Purchase | నాణ్యత ప్రమాణాలే అడ్డంకులా?

కందులలో తేమ శాతం 12 శాతం లోపు ఉండాలన్న నిబంధన సాంకేతికంగా సరైనదే అయినప్పటికీ, వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అనూహ్య వర్షాలు, చలిగాలులు, తేమతో కూడిన వాతావరణంలో పంటను పూర్తిగా ఎండబెట్టడం రైతుకు అంత సులభం కాదు. తేమ శాతం పేరుతో కందులను తిరస్కరిస్తే, మద్దతు ధర ఉద్దేశమే నీరుగారిపోయే ప్రమాదం ఉంది.

Paddy Purchase | సిఎం యాప్ – సౌకర్యమా, సంక్లిష్టతా?

సీఎం యాప్‌లో నమోదు తప్పనిసరి చేయడం పారదర్శకత దిశగా అడుగేనని చెప్పవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక అవగాహన లేని రైతులు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. రైతు సేవా కేంద్రాలపై భారం పెరిగినప్పుడు, నమోదు ప్రక్రియ ఆలస్యం కావడం, సాంకేతిక లోపాలు రావడం సహజం. ఇప్పటివరకు 5,379 మంది రైతులు మాత్రమే నమోదు కావడం, మొత్తం కందుల రైతుల సంఖ్యతో పోలిస్తే తక్కువగానే కనిపిస్తోంది.

Paddy Purchase | డిబేట్ చెల్లింపులు – హామీ మాటలకే పరిమితమా?

కందుల కొనుగోలు విలువను డీబీటీ విధానంలో నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది ప్రశంసనీయం. కానీ గతంలో డీబీటీ చెల్లింపులు ఆలస్యమైన ఉదాహరణలు రైతుల మదిలో ఇంకా తాజాగానే ఉన్నాయి.

ఈసారి కనీసం నిర్ణీత కాలవ్యవధిలో చెల్లింపులు జరిగితేనే రైతుకు ఈ కొనుగోళ్లపై నమ్మకం పెరుగుతుంది.ప్రభుత్వానికి పరీక్ష సమయంమొత్తంగా కర్నూలు జిల్లాలో కందుల కొనుగోళ్లు ప్రభుత్వం రైతు పక్షాన నిలిచే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రకటనగా మిగిలిపోతుందా, లేక రైతుకు నిజమైన ఆర్థిక భరోసా అవుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.

Paddy Purchase | నాణ్యత పేరుతో తిరస్కరణలు.,

సాంకేతిక అడ్డంకులు, చెల్లింపుల ఆలస్యాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. రైతు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ధైర్యం పొందాలంటే, మద్దతు ధర మాటలు కాదు… అమలే మాట్లాడాలి.

Leave a Reply