వైసీపీ ర్యాలీకి పోలీసుల ఆంక్షలు..
మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కు నోటీసులు
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు డిఎస్సీ అక్రమాలపై, ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి, కృష్ణాడెల్టాకు సాగునీరు కోరుతూ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఈ నేపథంలో ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు అందించారు. అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు పోలీసులు నోటీసులు అందించటం జరిగింది. కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందు కూటమి ప్రభుత్వం పోలీసులతో ఆంక్షలు విధిస్తూ ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అనేక విధాలుగా ఆపేందుకు ప్రయత్నిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సింహాద్రి రమేష్ తెలిపారు.
