ఫ్రెండ్స్ క్లబ్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్‌లో శనివారం మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పూల నాగయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘం నాయకుడు పరిగె రాములు, వాకర్స్ అసోసియేషన్ గౌరవ సభ్యుడు మంగ నరసింహులు, వీఆర్వో యాదయ్య, ఉపాధ్యాయ నాయకులు నరేంద్ర స్వామి, సైదులు, పరమేశ్వర్, శంకర్ రెడ్డి, దూడల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పూల సూర్యకుమార్, చంద్రకుమార్, రాహుల్ తేజ పాల్గొని ఫూలే సేవలను స్మరించుకున్నారు.
