Ordered | కాల్పు విర‌మ‌ణ గ‌డువు పొడిగించం

Ordered | కాల్పు విర‌మ‌ణ గ‌డువు పొడిగించం

Ordered | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌కు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కొత్త వార్నింగ్ ఇచ్చాడు. కాల్పుల విర‌మ‌ణ గ‌డువు పొడిగించేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. ఈ నెల 21లోపు ఇరాన్ ఒప్పందం చేసుకోవాల‌న్న ట్రంప్ ఆదేశించాడు. హ‌ర్మూజ్ జ‌ల‌సంధి దిగ్బంధాన్ని కొన‌సాగిస్తామ‌ని ట్రంప్ ప్ర‌క‌టించాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించొచ్చని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్‌ ఇరాన్‌ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హర్మూజ్​ను మళ్లీ మూసివేస్తామంటూ ఇరాన్​ వార్నింగ్ ఇచ్చింది.

ఇరాన్​ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో హ‌ర్మూజ్ జ‌ల‌సంధి ద‌గ్గ‌ర అమెరికా నౌక‌ల మోహ‌రింపు కొన‌సాగుతోంది. హెలికాఫ్ట‌ర్లు, ఫైట‌ర్ జెట్స్‌ నిరంత‌ర ప‌హారా కాస్తున్నాయి. అరేబియా స‌ముద్రంలో యూఎస్ెస్ మైఖేల్ మ‌ర్ఫీ గ‌స్తీ కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 21 ఆయిల్ షిప్‌ల‌ను దారి మ‌ళ్లించామ‌ని అమెరికా ప్ర‌క‌టించింది. యూఎస్ఎస్ అబ్ర‌హాం లింక‌న్‌, యూఎస్ఎస్ డెల్‌బ‌ర్ట్ బ్లాక్‌తో అమెరికా నిఘా ఉంచింది. హ‌ర్మూజ్ ద‌గ్గ‌ర 10వేల మంది అమెరికా సైనికులు ప‌హారా కాస్తున్నారు.

Leave a Reply