Anantapur | లాఠీలపై వేటు..

  • వణుకుతూ ఉద్యోగం
  • నలిగిపోతున్న అధికారులు
  • రాజకీయ చట్టం
  • లూప్ లైన్ కష్టాలు

పోలీసులకు ఉద్యోగం భారంగా మారిపోయింది. రాజకీయ చక్రంలో పడి నలిగిపోతున్నారు. ఒకప్పుడు పోలీసులపై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదు. ఏదైనా ఇబ్బంది వస్తే రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారికి ఆ సమస్య తీవ్రతను వివరించగలిగితే సర్దుకొనేవారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెబితే ఆలకించేవారు. అధికారులకు విధి నిర్వహణలో కాస్త స్వేచ్ఛ ఇచ్చేవారు. ఇప్పుడు పోస్టింగ్ మొదలుకొని అక్కడ డ్యూటీ చేయడం వరకు అన్ని విషయాలు అధికార పార్టీ పెద్దల కనుసన్నల్లోనే జరగాలి. లేకపోతే కష్టాలు తప్పవు.

అనంతపురం బ్యూరో, (ఆంధ్రప్రభ) : ఒకప్పుడు పోలీసు ఉద్యోగం చాలా ఛాలెంజింగ్ గాను ఫ్రీగా నిర్వహించేవారు. రౌడీ షీటర్లు రాజకీయ నేరస్తులు, వైట్ కాలర్ నేరాలపై ఉక్కు పాదం మోపేవారు. ఏదైనా నేరం జరిగితే నేరస్తులను బహిరంగంగా శిక్షించి తాట తీసేవారు. ఆ భయానికి చాలావరకు నేరాలు తగ్గేవి.

గతంలో ఆ విధంగా ధైర్యంగా విధులు నిర్వహించిన అధికారుల పేర్లు ఇప్పటికీ ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు. అయితే, ప్రస్తుతం పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాముగా మారిపోయింది. గడిచిన దశాబ్ద కాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. పోస్టింగ్ పొందడమే గగనగా మారిపోయింది.

ఐపీఎస్, డి.ఎస్.పి మొదలుకొని సిఐ,ఎస్ఐ కానిస్టేబుల్ వరకు అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు లేకపోతే కోరుకున్న చోటు లభించదు. సిఫారసు ఉన్నవారికి పోస్టింగులు దక్కుతున్నాయి. లూప్ లైన్ లో ఉంటే జీతాలు రావు కుటుంబాలు గడవవు. నెలల తరబడి పోస్టింగ్ కోసం ఎదురుచూడం కష్టం.

దీంతో కొందరు రాజకీయ పెద్దలకు సరెండర్ అయిపోయి పోస్టింగ్ వేయించుకుంటున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్డదిడ్డమైన పనులు చేయాలని పెద్దలనుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథంలో కొందరు ఏకంగా సెలవుపై వచ్చేస్తున్నారు.

కొందరిపై మచ్చ వేసి బలవంతంగా విఆర్ కు పంపుతున్నారు. అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు జిల్లాలో ఎస్సై స్థాయి నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లా మొత్తంగా ఆయనకు అన్ని రాజకీయ వర్గాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ మధ్యనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంత జరిగిన వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు.5

వేలాదిమంది రావడంతో అధికార పార్టీకి కోపం వచ్చింది. మరోవైపు ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వి ఆర్ కి పంపించారు. విజయవాడ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. స్థానికంగా ఉన్న నేతలతో ఆయనకు సంబంధాలు బెడిసి కొట్టినట్లు అంటున్నారు.

మొత్తానికి వెంకటేశ్వర్లు విఆర్ కి పంపడం పోలీసులలో చర్చనియాంశమైంది. తాజాగా యాడికి సిఐ ఈరన్నను వీఆర్ కు పంపించారు. ఈ మధ్యకాలంలో ఎస్పీ జగదీష్ యాడికి సర్కిల్ సందర్శించారు. అక్కడ ఆయనపై రకరకాల ఆరోపణలు వచ్చినట్లు చెబుతున్నారు. ఆయనను విఆర్ఓ పంపారని పేర్కొంటున్నారు.

రాజకీయ సమస్యతోనే ఆయనపై వేటు పడిందని చర్చ నడుస్తోంది. జిల్లాలో మరికొందరు పోలీసు అధికారులపై త్వరలో వేటుపడే అవకాశం ఉంది. కళ్యాణ్ దుర్గం సబ్ డివిజన్ తో పాటు గుంతకల్లు సబ్ డివిజన్లో పనిచేసే అధికారులపై నివేదికలు వెళ్లాయని పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

వీఆర్ లో కష్టాలు

జిల్లాలో చాలామంది సిఐలు విఆర్ లో ఉంటున్నారు. ఆ సమయంలో జీతాలు రావు. నెలల తరబడి జీతాలు రాకపోతే ఇల్లు గడవడం కష్టమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టింగ్ ల కోసం తిరుగుతున్నారు. ఈ విధంగా జిల్లా మొత్తంగా పోలీసులు ఇబ్బందుల పాలు అవుతున్నారు. పదుల సంఖ్యలో సీఐలు పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. రికమండేషన్లు లేక అక్కడ ఇక్కడ పరుగులు పెడుతున్నారు.

Leave a Reply