NTR Distt | మేం భ‌య‌ప‌డం..

NTR Distt | మేం భ‌య‌ప‌డం..

  • లోకేష్ ఎన్ని పేజీలు చించిన త‌గ్గేదేలే..
  • నానాటికీ దిగజారుతున్న కూటమి ప్రభుత్వం
  • ఎన్ని కష్టాలు పెట్టినా నిలబడతాం
  • ప్రభుత్వ తీరును గమనిస్తున్న ప్రజలు
  • వైసీపీకి అండగా రాష్ట్ర ప్రజలు
  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
  • సబ్ జైల్లో జోగి రమేష్‌ను కలిసిన వైసీపీ నేతలు

NTR Distt | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్నినడిపిస్తూ ప్రతిపక్ష పార్టీలను భయకంపితులను చేసిన ప్రజల పక్షాన పోరాడుతూ ఎదురొడ్డి నిలబెడుతున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ములాకత్ అయ్యారు. సబ్ జైల్లో రమేష్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.

NTR Distt

అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు జోగి రమేశ్ అన్నారు. ఎన్ని కష్టాలు పెట్టిన తట్టుకొని నిలబడదాం అని జోగి రమేశ్ చెప్పారని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పని చేస్తానని రమేష్ చెప్పారన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, రమేష్ కుటుంబ సభ్యుల పై కూడా కేసులు పెడుతున్నారని చెప్పారు. జోగి రమేష్ అరెస్ట్ అయిన సరే నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పని చేస్తున్నారని, రమేష్ కుమారుడు కూడా ఆక్టివ్‌గా ఉన్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తుందని, ప్రభుత్వ చర్యల వలన వైసీపీ కార్యకర్త కూడా భయపడడన్నారు. అమరావతిని ఆవకాయ అమరావతిగా మార్చేశారని, లోకేష్ ఎన్ని పేజీలు చింపిన భయపడేది లేదనీ స్పష్టం చేశారు.

NTR Distt

Leave a Reply