TG | కేటీఆర్ సెటైర్లకు మంత్రి పొన్నం కౌంటర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బీజేపీని గెలిపించినందుకు రాహుల్‌గాంధీకి కంగ్రాట్స్’ అంటూ వ్యంగాస్త్రం సంధించారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ వేసిన ట్వీట్‌కు ఎక్స్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్‌కి చాలా ఆనందం కలిగిస్తున్నట్టు ఉందని విమర్శించారు. లోలోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండతో ఇష్టానుసారం దోచుకుతిని అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొదలని బీజేపీ భజన చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడపోయింది ? అని ప్రశ్నించారు. ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా శునకానందం పొందినారు మీ భారత రాష్ట్ర సమితి నాయకులు అని విమర్శించారు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయలేనిదని సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసిందని, నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *