- బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటి
- ఆరోగ్యం, విద్య రంగాలపై చర్చ
- ఎపికి సాయం చేయాలని అభ్యర్దన
- మూడు ఒప్పందాలపై సంతకాలు
- పార్లమెంట్ ను సందర్శించిన అపర కుబేరుడు
- కేంద్ర మంత్రులను కలిసిన బిల్ గేట్స్
బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటి
ఆరోగ్యం, విద్య రంగాలపై చర్చ
ఎపికి సాయం చేయాలని అభ్యర్దన
మూడు ఒప్పందాలపై సంతకాలు
పార్లమెంట్ ను సందర్శించిన అపర కుబేరుడు
కేంద్ర మంత్రులను కలిసిన బిల్ గేట్స్
న్యూ ఢిల్లీ – హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయం రంగాలలో సహకారం ఇవ్వాలని మెక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నేడు ఢిల్లీ పార్లమెంట్ కు వచ్చిన బిల్‌గేట్స్ తో బేటి అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. హెల్త్, ఎడ్యుకేషన్, వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. బిల్ గేట్స్‌ను అమరావతి, తిరుపతికి రావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు బిల్‌గేట్స్ అంగీకరించారు.
ఈ సమావేశం గురించి చంద్రబాబు ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఏ విధంగా భాగస్వామ్యం కావొచ్చనే అంశంపై ఫలప్రదమైన చర్చ జరిగిందని తెలిపారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి కల్పన తదితర కీలక రంగాల్లో సేవలను మెరుగుపర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఉన్న అవకాశాలను చర్చించామని చంద్రబాబు వివరించారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ ను సాకారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని… ఈ లక్ష్యాన్ని సాధించడంలో, ఏపీ ప్రజల సాధికారతను పెంచడంలో గేట్స్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం, ఆలోచనలు, మద్దతు ఇస్తున్నందుకు బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

పార్లమెంట్ ను సందర్శించిన బిల్ గేట్స్ ..
ఇది ఇలా ఉంటే భారత్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన బిల్ గేట్స్ నేడు భారత పార్లమెంట్ ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో చర్చలు జరిపారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశయ్యారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి సహా వివిధ సమస్యలపై చర్చించారు. భారతదేశంలో జరుగుతున్న వ్యవసాయ పరిశోధనలు అద్భుతమైనవి అని బిల్ గేట్స్ చెప్పారు. ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.