Karnataka CM | జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం

Karnataka CM | జూన్ 3న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
Karnataka CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ ) నేతగా డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న మార్గం సుగమమైంది.
సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ పేరును మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, సీనియర్ నేత పరమేశ్వర బలపరిచారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయన పేరును ఆమోదించారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
సీఎల్పీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ త్వరలోనే కర్ణాటక గవర్నర్‌ను కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని ఆయన గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. ఈ మేరకు అవసరమైన మద్దతు వివరాలను కూడా సమర్పించనున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర నాయకత్వ మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దశలోకి అడుగుపెట్టనుంది.
