E20 Petrol | అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

E20 Petrol | అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

ఢిల్లీలో తొలి బంక్​ను ప్రారంభించిన కేంద్ర‌మంత్రి
పెట్రోల్ కంటే ₹20 తక్కువ ధరతో ఇ-85 ఇథనాల్
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త ఇంధనం
విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమే లక్ష్యం
చెరకు, మొక్కజొన్న, బియ్యంతో ఇథ‌నాల్ త‌యారీ
2027 చివరి నాటికి 5,000 ఔట్‌లెట్ల ఏర్పాటు

E20 Petrol | న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తూ, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇ-85’ ఇంధనాన్ని ప్రారంభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ ఔట్‌లెట్‌లో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ కొత్త ఇంధనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇ-85 ఇంధనంలో 80-85 శాతం ఇథనాల్, 14-19 శాతం పెట్రోల్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో కూడిన వాహనాల కోసం రూపొందించారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దీని ధర లీటరుకు దాదాపు ₹20 తక్కువగా ఉండటం వినియోగదారులకు పెద్ద ఊరట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 48 ఫ్యూయల్ స్టేషన్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దశలవారీగా ఈ సంఖ్యను పెంచనున్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి 500, 2027 డిసెంబర్ నాటికి 5,000 రిటైల్ ఔట్‌లెట్లలో ఇ-85ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

E20 Petrol |
E20 Petrol |

E20 Petrol | ఆత్మ నిర్భర్​ భారత్​ స్ఫూర్తి..

E20 Petrol |
E20 Petrol |

ఈ సందర్భంగా కేంద్రం మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. ఇంధన లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే మూడు అంశాలను భారత్ విజయవంతంగా సమన్వయం చేస్తోందన్నారు. 2014లో కేవలం 1.53 శాతంగా ఉన్న ఇథనాల్ బ్లెండింగ్‌ను, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే 20 శాతం లక్ష్యానికి చేర్చామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు ₹1.84 లక్షల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, సుమారు 302 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గాయని వివరించారు. ఈ ప్రగతితో దేశ రైతులు ‘అన్నదాతలు’ అనే స్థాయి నుంచి ‘ఊర్జదాతలు’ (శక్తి ప్రదాతలు)గా మారుతున్నారని ఆయన ప్రశంసించారు. ఇ-85 ఇంధనం కేవలం ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమేనని, దీని వాడకంపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాడుతున్న ఇ-20 ఇంధనం వల్ల ఇప్పటివరకు ఒక్క ఇంజిన్ వైఫల్యం కూడా నమోదు కాలేదని గుర్తుచేశారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు, ఇ-85 ఇంధనం వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు 61 శాతం వరకు తగ్గుతాయని అంచనా. ఈ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల విధానంలో సహకరించాలని మంత్రి కోరారు. “ప్రతి లీటరు ఇథనాల్ దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనానికి ప్రత్యామ్నాయం. ప్రతి ఇ-85 చుక్కలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి ఉంది” అని పురి అన్నారు.

E20 Petrol | ఆ వాహ‌నాల‌కు మాత్ర‌మే..

పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు ఎటువంటి అయోమయానికి గురికాకుండా ఉండేందుకు, ఈ కొత్త డిస్పెన్సర్లకు ప్రత్యేకమైన బ్రాండింగ్, లేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని 85 కంప్లైంట్ ఇంజిన్లు ఉన్న వాహనాల్లో మాత్రమే వాడాల్సి ఉంటుంది. దేశంలో లభ్యమయ్యే ఇ20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటాయి. ఇ85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమం ఉంటుంది. ఇథనాల్ వాడకం పెరగడంతో పెట్రోల్ వినియోగం తగ్గి, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి ఇథనాల్ తయారు చేస్తారు. ప్రాథమిక దశలో భాగంగా ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో మరిన్ని ఇథనాల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ముంబై-పూణే-నాగపూర్ కారిడార్లలో సుమారు 50 నుండి 100 వరకు ఇ85 స్టేషన్లను నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ తర్వాత ఈ ఏడాది చివరి నాటికి 500 స్టేషన్ల నెట్‌వర్క్‌ను సిద్ధం చేయాలని భావిస్తోంది. అలాగే 2027 చివరి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 5,000 పైగా ఈ85 ఫ్యూయెల్ స్టేషన్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

E20 Petrol | సామర్థ్యాన్ని పరిశీలించే చర్యలు..

ముఖ్యంగా ఈ కొత్త ఇంధనాన్ని వాడే ముందు వాహనాల సామర్థ్యాన్ని గమనించడం అత్యంత ముఖ్యం. ప్రస్తుతం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేదా ఆ మేరకు కాలిబరేట్ చేసిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలు మాత్రమే దీనిని ఉపయోగించగలవు. హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రేంజ్‌ను ఈ విభాగంలో లాంచ్ చేసింది. వీటి ఇంజిన్, మెకానిజంలో సుమారు 39 మార్పులు చేయడంతో ఇవి ఇ85 ఇంధనంపై సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మార్పుల వల్ల బైక్‌ల పవర్ అవుట్‌పుట్ కూడా పెరిగింది. మరోవైపు, మారుతి సుజుకి తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూల్ కారు ఫ్లెక్స్ ఫ్యూయెల్ ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి ఇది వాణిజ్య అవసరాలకు అంటే ఫ్లీట్ ఆపరేటర్లు లేదా టాక్సీ సర్వీసుల కోసం అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ కారును సాధారణ వినియోగదారులకు కూడా విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ వాహనం ఇ100 ఇంధనంపై కూడా సునాయాసంగా నడుస్తుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.

CLICK HERE TO READ MORE : Zelenskyy | నాలుగేళ్ల యుద్ధానికి తెర దించుదాం..

CLICK HERE TO READ MORE :

Leave a Reply