అలల ఉద్ధృతితో అప్రమత్తం..

అలల ఉద్ధృతితో అప్రమత్తం..
పర్యాటకులకు కీలక సూచన
కోడూరు ఆంధ్రప్రభ: ఈదురు గాలుల ప్రభావంతో హంసలదీవి బీచ్ వద్ద అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. అలల తాకిడితో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శనివారం పాలకాయతిప్ప కరకట్ట వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లను మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.వి.కే. కుమార్ తెలిపారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు పరిస్థితిని గమనించి బీచ్ వద్దకు రావద్దని సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత బీచ్ గేట్లను తిరిగి తెరవనున్నట్లు తెలిపారు.
