GT vs PBKS | పంజాబ్ తొలి వికెట్ డౌన్..

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టుకు తొలి ఓవర్లలోనే షాక్ తగిలింది.

పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. 3.1వ ఓవర్లో రబాడ వేసిన బంతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

దీంతో 28 ప‌రుగుల‌కు ఒక వికెట్ కోల్పోయింది పంజాబ్ జ‌ట్టు. ప్ర‌స్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్య (17) – శ్రేయ‌స్ అయ్యార్ ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ బౌలింగ్ ఎంచుకుని పంజాబ్ కింగ్స్ ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.

Leave a Reply