Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story

Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story

  • మొక్క‌జొన్న రైత‌న్న ఆశ‌లు ఆవిరి ..!
  • పంట కోతకు నిరాకరణ
  • పొలంలోనే పొత్తులు జ‌ల‌జ‌ల‌
  • పెట్టుబడి ఆశలు ఆవిరి
  • విత్తనోత్పత్తి రైతు విలవిల
  • ఇదీ ప్ర‌కాశంలో మొక్క‌జొన్న దీన‌స్థితి

( అర్ధవీడు, ఆంధ్రప్రభ)

Farmer Hopes evaporate

మొక్కజొన్న విత్తన కంపెనీలు వింత నాటకం మొదలెట్టాయి. ఏటా విత్తు దశలోనే చిక్కు ముడులు వేసే కంపెనీలు ఈ సారి కోత సమయంలో కిరికిరి పెడుతున్నాయి. ఆశాజానకమైన దిగుబడులు వస్తున్నాయి అని రైతు మోముపై ఆనందాన్ని చూసే లోపే ఆవిరి చేసేస్తున్నాయి. పంట గడువు ముగిసినా కోతకు అనుమతి ఇవ్వడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గుడిని గుడిలింగాన్ని మింగేసే ఎత్తులు వేస్తున్నాయి.

Farmer Hopes evaporate : గడువు ముగిసినా…

Farmer Hopes evaporate

మొక్కజొన్న విత్తనోత్పత్తి పంటకాలం 120 రోజులు. గడువు ముగిసిన వెంటనే పంట కోయించి దిగుబడులను కంపెనీలు తమ గోడౌన్లకు తరలిస్తాయి. ఒప్పంద వ్యవసాయంలో గత 30 ఏళ్లుగా అనుసరిస్తున్న పద్ధతి ఇదే. ప్రస్తుతమూ ఇదే పద్దతి అనుసరించాలి. కానీ, కంపెనీలు కిరికిరి పెడుతున్నాయి.120 రోజులకు కాదు 130 రోజుల తరువాతే కోత అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నాయి. ఇది పూర్తిగా రైతు ద్రోహ చర్యే.

Farmer Hopes evaporate : రూ. కోట్లల్లో నష్టం

Farmer Hopes evaporate

మండలంలో సుమారు మూడు వేలకు పైగా ఎకరాల్లో మొక్కజొన్న విత్తనోత్పత్తి సాగవుతోంది. ఇందులో దాదాపు 80 శాతం పంట 120 రోజుల కోత సమయం దాటింది. ఇప్పటికీ కోతకు కంపెనీలు అనుమతి ఇవ్వలేదు. రైతులు నేరుగా అడిగితే రెండు మూడు రోజుల్లో కోయండి అంటూ చెబుతున్నారు. తీరా ఆ గడువు వచ్చేసరికి లారీలు దొరక లేదనో, గోడౌన్లో నిల్వలు కదల్లేదనో కుంటి సాకులు చెప్పి తేదీలు మార్చేస్తున్నారు. ఇదే సమయంలో 130 రోజులు గడిస్తే గాని కోసేది లేదని పరోక్షంగా చెబుతున్నారు. కంపెనీలు ఆడే ఈ మాయా జూదం వల్ల రైతులు రూ. కోట్లు నష్టపోతారు. అదే సమయంలో కంపెనీలు కరెన్సీ కట్టలు పోగేసుకుంటాయి.

Farmer Hopes evaporate : ఇదిగో ఇలా..

Farmer Hopes evaporate

120 రోజులు పూర్తయ్యే సరికి దాదాపు 95 శాతం పైరు, పంట ఎండుముఖం పడుతుంది. చిన్నపాటి గాలి వీచినా నేల కూలేంతా బలహీన దశకు చేరుతుంది. గడువు దాటి రోజులు గడిచే కొద్ది పైరు తనకు తానే నేల ముఖం పడుతుంది. ఆ తరువాత పంట కోసినా చేతికి రాదు. నాలుగు నెలల కాలం అహోరాత్రులు రైతులు చేసిన కష్టం, పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు నేల పాలవుతాయి.

Farmer Hopes evaporate : అయితే! కంపెనీలకు ఏంటి?

గడువు పెంచి కోత కోయడం వల్ల కంపెనీలు కోట్లల్లో అదనపు లాభాన్ని ఆర్జిస్తాయి. సాధారణంగా 120 రోజులకు కోయించిన మొక్కజొన్న పంటను తీసుకెళ్లిన కంపెనీలు వెంటనే బాయిల్ చేస్తాయి. ఇందుకు ఖర్చు అవుతుంది. అదే 130 రోజుల తరువాత పంటలో తేమ శాతం దాదాపు ఉండదు. ఈ కారణంగా బయిలింగ్ కోసం చేసే వ్యయం భారీ ఎత్తున తగ్గిపోతోంది. మరో వైపు 120 రోజుల గడువులో కోసే పంటలో కొంత తేమ ఉంటుంది. దానిని అలానే కాటా వేసి ధర చెల్లిస్తారు. అదే 130 రోజులు దాటి కోయిస్తే తేమ ఉండదు. తూకాలు తగ్గుతాయి. కంపెనీ చెల్లింపులు మిగులుతాయి. విచిత్రమేమంటే గతంలో ఎప్పుడు ఈ తరహా దోపిడీకి కంపెనీలు పాలుపడలేదు.

Farmer Hopes evaporate : ఇప్పుడే ఎందుకు?

విత్తన కంపెనీలు తాజాగా ప్రదర్శిస్తున్న నీచమైన కుట్రకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి దానిని రైతులే విశ్లేషస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న విత్తనోత్పత్తి దిగుబడి పెరిగింది. ఎకరానికి 2.5 టన్నులు దిగుబడి వస్తే ఫర్వాలేదు అనే భావన ఉండేది. మూడు టన్నులు వస్తే గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుతం ఆ దిగుబడి 3-4టన్నులకు తగ్గడం లేదు. ఐదు టన్నుల దిగుబడి తీసిన రైతులు వున్నారు. బహుశా కంపెనీలు సైతం ప్రస్తుత దిగుబడిని ఊహించి వుండవు. ఈ నేపథ్యంలో రైతుకు అధిక చెల్లింపులు చేసే ఇష్టం లేక గడువు పెంపు మెలికలు పెడుతున్నాయని రైతుల వాదనగా ఉంది. రెండో కారణం విధాన పరమైంది. తాజాగా భారత్ – అమెరికా ల మధ్య వాణిజ్య ఒప్పందం జరిగిందనే వార్తలు వచ్చాయి. జీరో సుంకాలపై అమెరికా నుండి మొక్కజొన్న దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు రైతు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నాయనే విశ్లేషణ ఉంది.

Farmer Hopes evaporate : ఎదురీతకు ఫలితం దక్కేనా?

Farmer Hopes evaporate

ఈ ఏడాది మొక్కజొన్న విత్తన రైతు ఏటికి ఎదురీడాడు అనే చెప్పాలి. విత్తు సమయంలో తీవ్ర ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఎడ తెరిపి లేని వర్షం కురిసింది. వ్యవసాయ కమతాలు ఉరకలెక్కాయి. ఒక వైపు అదను దాటి పోతోంది. మరోవైపు కమతాలు చిత్తడి వీడలేదు. ఆరిన నెలలు బిగస్సుకు పోయాయి. విత్తడానికి కమతాన్ని సిద్ధం చేసేందుకు అదనంగా భూమిని దున్నాల్సి వచ్చింది. విత్తు విత్తిన దగ్గర నుండి ఫైరు మొలక, ఎదుగుదలపై నిరంతరం రైతులు భయాందోళనలో మునిగి తేలారు. కడకు తమ అనుభవాన్ని రంగరించి ఉత్పత్తులు తీశారు. ఇందుకు అదనపు శ్రమ, పెట్టుబడి వెచ్చించారు. ఫలితం తినబోయేసరికి కంపెనీలు గరళంలా మారాయి. ఈ గండం నుండి ఏ రైతు పక్షపాతి కాపాడతారో తెలీదు. ఈ విషయంలో రైతు సేవకు అంకితం అని చెప్పుకునే వ్యవసాయ శాఖ పాత్రను ఏ మాత్రం ఆశించ లేం. ఈ సీజన్లో ఆ శాఖ ఒక్క ఎకరా మొక్కజొన్న పైరును పరిశీలించి సలహా ఇచ్చిన దాఖలా లేదు. బహుశా పాలకులు జ్యోక్యం చేసుకుంటారో.. లేక అది అత్యాశ అవుతుందో వేచి చూడాలి.

ALSO READ : Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర

Leave a Reply