RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ధాన్యం కొనుగోళ్లు సజావుగా జ‌ర‌గాలి
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోళ్లలో గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క రైతును నష్టపోనివ్వనని, కొనుగోళ్లు వేగంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతుల‌కు ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గుడ్లవల్లేరు మండలంలో (In Gudlavalleru Mandal) ఎమ్మెల్యే పర్యటించారు. పలుచోట్ల రైతులతో సమావేశమైన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌతవరం పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంబటి ఆరబోసిన ధాన్యపు రాశులు, కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలను ఆయన పరిశీలించారు.

ధాన్యం కొనుగోళ్ళలో ఆర్ఎస్కే నిర్ణయించిన తేమశాతం… రైస్ మిల్లర్లు(Rice MIllers) చెబుతున్న తేమ శాతంలో వ్యత్యాసం ఉంటుందని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. జేసీతో మాట్లాడిన ఎమ్మెల్యే… మిల్లర్ల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్ఎస్కే కేంద్రాల వద్ద తేమ శాతం నిర్ధారణ పరీక్షను పరిశీలించిన ఎమ్మెల్యే, పలువురు రైతులకు ధాన్యం విక్రయాలకు అవసరమయ్యే ట్రక్ షీట్ పత్రాలను అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర (Support Price to Former) సమయానికి కొనుగోలు, పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు తలెత్తితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. రైతన్నలు అపోహలకు పోవద్దని, ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఆర్ఎస్కే ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శాఖాపరమైన సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు (Corporation Chairman Ravi Venkateswara Rao) గుడ్లల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరు రవి, తహసీల్దార్ లోకరాజ్, వ్యవసాయ శాఖ ఏఓ లోయ సునీల్, ఆర్ఐ హనుమ, మండల కూటమి నాయకులు సాయన పుష్పావతి, వల్లభనేని బాబురావు, మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, వీరమాచినేని శివప్రసాద్, పేన్నేరు రమేష్, పామర్తి సత్తిబాబు, కొడాలి రామరాజు, వల్లభనేని రంగబాబు, నిమ్మగడ్డ సత్య సాయి, పిచ్చేశ్వరరావు, నవాబు, తోటమల్లి, బ్యాంకు అధ్యక్షుడు యుగంధర్, శివాజీ రెడ్డి, నాగన్న, బుర్ర నాగేశ్వరరావు, పాగోలు అనిల్, ఆంజనేయులు, నాంజి బాబు, కంచర్ల ప్రకాష్, జోజి, తూము పద్మజ, కుప్పినేని శేషవేణి, ఈడే కృష్ణారావు, అడపా బాబి, వెంకటేశ్వరరావు, శివ, బొల్లాకింగ్, మురళీకృష్ణ, రామారావు, మేకామేశ్వరరావు, యార్లగడ్డ వెంకన్న, చిట్టి బొమ్మ రాజు, ఈద వెంకటేశ్వరరావు, మధిర బ్రహ్మనాయుడు, షేక్ జానీ పాల్గొన్నారు.

Leave a Reply