గ్రూప్‌-1 ల‌క్ష్యంగా పెట్టుకున్నా..

గ్రూప్‌-1 ల‌క్ష్యంగా పెట్టుకున్నా..

ఉట్నూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తాను ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజుల్లో ఓ ఉపాధ్యాయుడు గ్రూప్‌-2కు ఎంపిక‌య్యారని, ఆ ఉపాధ్యాయుడిని చూసి తాను ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు గ్రూప్ -1లో ఎంపీడీఓగా ఎంపికైన ల‌వ‌కుమార్ (Lavakumar) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన తుడుము లవ కుమార్ గ్రూప్ -1 (Group 1) ఫలితాల్లో 902వ‌ ర్యాంకు సాధించి ఎంపీడీఓకు ఎంపిక‌య్యారు. బుధ‌వారం రాత్రి గ్రూప్‌-1 ఫ‌లితాలు వెల్ల‌డించారు.


గ్రూప్‌-1కి ఎంపికైన ల‌వ్‌కుమార్ ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న రోజుల్లో అంటే ప‌దేళ్ల వ‌య‌స్సు స‌మ‌యంలో త‌ల్లిదండ్రులు మర‌ణించారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుకొని పట్టుదలతో మొదట గ్రూప్-2-3 పరీక్షలు రాసి గత 2022 నుండి గ్రూప్ 1 ఫోకస్ పెట్టి మూడోసారి గ్రూప్ వన్ లో ర్యాంక్ సాధించి ఎంపీడీఓ (MPDO) గా ఎంపికయ్యారు. తాను గ‌త ఆరేళ్లుగా నార్నూర్ మండ‌లం మాన్క‌పూర్ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశాన‌ని ల‌వ‌కుమార్ తెలిపారు. తాను ఏడో తరగతి చదివేటప్పుడు త‌మ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయునికి గ్రూప్ – 2 రావడంతో అది తెలుసుకొని అప్పటినుండి సాధించాలని లక్ష్యం పెట్టుకున్న‌మన్నారు.

Leave a Reply