మద్యం మత్తులో అతివేగంతో కారు…

మద్యం మత్తులో అతివేగంతో కారు…
ముగ్గురిని ఢీకొట్టిన కనకాల రామ్ కుమార్ రెడ్డి
ఇద్దరు అక్కడికక్కడే మృతి, ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు
నిందితుడు కనకాల రామ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నాం.. ఇన్స్పెక్టర్ రవిబాబు
ఎల్బీనగర్, ఆంధ్రప్రభ : వనస్థలిపురం ఇన్స్పెక్టర్ రవిబాబు తెలిపిన వివరాల ప్రకారం, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ముందు డివైడర్ దగ్గర ఆగి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ పైన ఉన్న కంచర్ల శివ హాలియా మండలం అల్వాల గ్రామానికి చెందిన వ్యక్తి, నకిరేకంటి సందీప్ కుమార్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మిర్యాలగూడకు చెందిన వ్యక్తి, టీఎస్ 08 జేఎల్ 2496 హోండా సిటీ కారును మద్యం మత్తులో మంగళవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు అతివేగంగా వచ్చి కనకాల రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి స్కూటీ పై ఉన్న శివ, సందీప్ కుమార్ లను బలంగా ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే కాళ్లు, చేతులకు, తలకు గాయాలు అయ్యి అధిక రక్తస్రావం కావడంతో మరణించారు.
మరో వ్యక్తి పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు క్రాస్ చేస్తుండగా మంచాల మండలంలోయపల్లి గ్రామానికి చెందిన సభావత్ శ్రీధర్ ను ఢీకొట్టడంతో అతనికి గాయాలు కాగా ఓంకార్ నగర్ నందు ఆగస్త్య హాస్పిటల్లో అడ్మిట్ చేయగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. టీచర్స్ కాలనీ బి.ఎన్.రెడ్డి నగర్ లో కనకాల రామ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం అని ఇన్స్పెక్టర్ రవిబాబు తెలిపారు. అనంతరం రెండు మృతదేహాలను ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు పోస్టుమార్టం గురించి తరలించాం అన్నారు.
