Dharna | మూడో రోజుకి చేరిన సహకార సంఘాల ఉద్యోగుల ధర్నా

Dharna | నాగాయలంక – ఆంధ్రప్రభ : సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బందికి జీవో నెం.36 అమలు చేయాలని, పెండింగులో వున్న 2019 సంవత్సరం నుంచి 2024 వరకు పీఆర్ సీలను వెంటనే ఇప్పించాలని కోరుతూ మూడో రోజు బుధవారం స్థానిక కేడీసీసీ బాంక్ కార్యాలయం ఎదుట నాగాయలంక, బర్రంకుల, పెదకమ్మవారి పాలెం, ఎదురుమొండి, పర్రచివర, ఏటిమొగ సంఘాల ఉద్యోగులు పాల్గొని ధర్నా చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల వలే వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తరువాత సహకార సంఘాల్లో జాయిన్ అయిన ప్రతి ఉద్యోగిని ఫర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కెవి. రామాంజనేయులు, పి.శ్రీ నివాసరావు, జీవీ భాస్కర రావు, కె.రాజేష్, కె.ఆనందబాబు నేతృత్వం వహించారు.
