అంతర్‌జిల్లా చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

అంతర్‌జిల్లా చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

6 కేసుల్లో 157.64 గ్రాముల బంగారం, పల్సర్ బైక్ స్వాధీనం
రూ.23.64 లక్షల విలువైన ఆస్తి రికవరీ.

న‌ర‌స‌న్న‌పేట‌, ఆంధ్రప్రభ : నరసన్నపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన చైన్ స్నాచింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు తెలిపారు .గురువారం ఉదయం 11 గంటలకు నరసన్నపేట మండలం సత్యవరం గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద సర్వీస్ రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నరసన్నపేట ఎస్‌ఐ బి. గణేష్ తన సిబ్బందితో కలిసి అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు పలు జిల్లాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారన్నారు. అరెస్టయిన నిందితులలో విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన ముండూరి సంతోష్ కుమార్, అదే గ్రామానికి చెందిన బూర అశోక్ ఉన్నట్లు తెలిపారు. రికవరీ చేసిన సొత్తులో నరసన్నపేట పీఎస్ కేసుకు సంబంధించిన 29.00 గ్రాముల బంగారు గొలుసు, శ్రీకాకుళం రూరల్ పీఎస్ కేసుకు సంబంధించిన 34.99 గ్రాముల బంగారు గొలుసు,పోలాకి పీఎస్ కేసుకు సంబంధించిన 23. గ్రాముల బంగారు గొలుసు,విజయనగరం జిల్లా రామభద్రపురం పీఎస్ కేసుకు సంబంధించిన 46.65 గ్రాముల బంగారు గొలుసు,
విశాఖపట్నం జిల్లా పెందుర్తి పీఎస్ కేసుకు సంబంధించిన 12.గ్రాముల బంగారు గొలుసు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పీఎస్ కేసుకు సంబంధించిన 12 గ్రాముల బంగారు గొలుసు నేరాలకు వినియోగించిన బజాజ్ పల్సర్ మోటార్ సైకిలు మొత్తంగా 157.64 గ్రాములు (సుమారు 14 తులాలు) బంగారం, ఒక బైక్‌తో కలిపి రూ.23,64,600/- విలువైన ఆస్తిని పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు సంతోష్ కుమార్ కార్పెంటర్‌గా పనిచేస్తూ తన స్నేహితుడు అశోక్‌తో కలిసి మద్యం సేవించడం, జల్సాలకు అలవాటు పడ్డాడని . సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై నెంబర్ ప్లేట్ తొలగించి, ముఖాలకు మాస్క్‌లు ధరించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యేవారన్నారు. వీరు నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు చైన్ స్నాచింగ్ కేసుల్లో నేరాలకు పాల్పడినట్లు విచరణలో తేలినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో సొత్తును రికవరీ చేసిన టెక్కలి డీఎస్పీ డి. లక్ష్మణరావు, నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై బి. గణేష్, సీసీఎస్ ఎస్సై భరత్, సర్కిల్ క్రైమ్ కానిస్టేబుళ్లు దాలి నాయుడు, ఆదినారాయణ, సీసీఎస్ కానిస్టేబుళ్లు శ్రీను, హరీష్లను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి అభినందించి ప్రశంసించారు.

Leave a Reply