Bodhan | వైద్యానికి పెద్దపీట

Bodhan | వైద్యానికి పెద్దపీట

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల వైద్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలో బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నమన్నారు. ఆసుపత్రులలో వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. సిబ్బంది, మందుల కొరత లేకుండా అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ తహసీల్దార్ విట్టల్, కమిషనర్ కృష్ణ జాదవ్, తదితరులున్నారు.

Leave a Reply