అకస్మాత్తుగా పెరిగిన బంగారం ధర
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)
మదుపుర్లకు గత వారం బంగారం ధరలు షాక్ ఇస్తే.. పసిడి ప్రియులకు బులియన్ మార్కెట్ ధరల వల విసిరింది. ఫలితంగా.. ఈ రోజు (10.11.2025) బంగారం ధర అకస్మికంగా పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం ( 24 క్యారెట్ల బంగారం) ధర ₹.1800 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹.1,650, 18 క్యారెట్ల బంగారం ధర ₹ 1350లు పెరిగింది. గత సోమవారం (3.11.2025) నుంచి ఆదివారం వరకూ బంగారం క్రయ, విక్రయాలను పరిశీలిస్తే.. ఈ వారంలో గ్లోబల్ మార్కెట్ ఒత్తిళ్లు తగ్గాయి. డాలర్ విలువ పెరిగింది. రేట్ కట్ పెరిగే వీలు లేక పోవటంతో.. బంగారం ధరలు పడిపోయాయి. 24 క్యారెట్ (999 ప్యూర్) బంగారం ధర సగటున ₹9.000 నుంచి ₹ 12,000లు తగ్గింది. ఈ స్థితిలో మదుపర్లు వెనకడుగు వేయటంతో.. దేశీయ పసిడి ప్రియులు బంగారు దుఖాణాలకు పరుగులు పెట్టారు. ఈ డిమాండుతో సోమవారం ధర పెరిగింది. గత వారం రోజులుగా బంగారం ధర పతనావస్థ పరిశీలిస్తే.. నవంబర్ 3 న ₹1,22,990 లు పలికిన 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర నవంబర్ 4 న : ₹1,22, 460కి చేరింది. అంటే ₹530లు తగ్గింది . నవంబర్ 5 న – ₹1,21,910లకు చేరింది. అంటే ₹ 510లు తగ్గింది. నవంబర్ 6న 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం నుంచి ₹122,170 కు చేరి ₹260 పెరిగింది. నవంబర్ 7న ₹1,22,020 లకు చేరి ₹150 తగ్గింది, నవంబర్ 8 న ₹1,22,020 (స్థిరం) నవంబర్ 9న ₹122,02 0 స్థిరంగా ఉంది. నవంబర్ 10న ₹1,23,820కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా గత వారంహెచ్చు తగ్గులతో ఊగిసలాట ఆడింది. సోమవారం ₹ 1,13,500కి పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర ₹ 92,870లకు చేరింది.
(సమాచారం: నవంబర్ 10, 2025 నాటి మార్కెట్ డేటా ఆధారంగా)
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
వరంగల్ ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
విజయవాడ ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
గుంటూరు ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
విశాఖపట్నం ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
చెన్నై ₹ 1,24,480లు ₹ 1,13,100లు ₹ 95,150లు
కోల్కత్త ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
ముంబై ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
ఢిల్లీ ₹ 1,23,970లు ₹1,13,650 లు ₹93,020లు బెంగళూరు ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
కేరళ ₹ 1,23,820లు ₹ 1,13,500 లు ₹ 92,870లు
అహ్మదాబాద్ ₹ 1,23,87 0లు ₹ 1,13,550లు ₹ 92,920లు
వడోదర ₹ 1,23,87 0లు ₹ 1,13,550లు ₹ 92,920లు

