Anil ravipudi | అలాంటి సినిమా చేయబోతున్నాడా..?

Anil ravipudi | అలాంటి సినిమా చేయబోతున్నాడా..?
Anil ravipudi | మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం అనిల్ రావిపూడి ప్లాన్
వెంకీ – కళ్యాణ్ రామ్ కాంబో మూవీపై అంచనాలు
యానిమేషన్ ఫిల్మ్‌పై అనిల్ రావిపూడి ఫోకస్
కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్
భవిష్యత్ టెక్నాలజీ దృష్టితో అనిల్ కొత్త ప్రయోగం
Anil ravipudi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ (Director) అనిల్ రావిపూడి. అందుకనే.. అనిల్ ని హిట్ మిషన్ అంటుంటారు. అయితే.. కమర్షియల్ సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు రూటు మార్చబోతున్నాడని.. ఎవరూ ఊహించని సినిమా చేయబోతున్నాడనే వార్త బయటకు వచ్చింది. దీంతో.. అనిల్ రావిపూడి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. అనిల్ ప్లాన్ ఏంటి..?
Anil ravipudi | మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం..
గత సంక్రాంతికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) .. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ ఇయర్ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రానున్న సంక్రాంతికి వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడానికి ప్లానింగ్ జరుగుతుంది. ఇందులో కథానాయికగా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. జూన్ లో ఈ క్రేజీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Anil ravipudi | అనిల్ – యానిమేషన్ ఫిల్మ్..
ఇక అసలు విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి త్వరలో ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాని (Movie) కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ నిర్మాణ సంస్థ జన నాయకుడు, టాక్సిక్ సినిమాలు నిర్మించింది. చిరు, బాబీ సినిమాని ఈ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే.. ఈ సంస్థ అనిల్ రావిపూడితో చేసే యానిమేషన్ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. త్వరలోనే వర్క్ స్టార్ట్ చేయబోతున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే ఇది అనిల్ రావిపూడి చేసిన సినిమాల మాదిరిగా ఫాస్ట్ గా అవ్వకపోవచ్చు. ఎంత లేదన్నా రెండు సంవత్సరాలు పడుతుంది.

Anil ravipudi | అందుకే.. యానిమేషన్ ఫిల్మ్..
ఇప్పుడు అనిల్ రావిపూడి వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తూ దూసుకెళుతున్నాడు. మరి.. కెరీర్ ఇంత బాగున్నప్పుడు ఎందుకు యానిమేషన్ మూవీ చేయాలి అనుకుంటున్నాడు అంటే.. భవిష్యత్ విజన్ అని చెప్పచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ మొదలైనవి మూవీ మేకింగ్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఆర్టిస్టులే లేకుండా కేవలం యానిమేషన్ తో తీసిన మహావతార్ నరసింహ ఎంతటి బ్లాక్ బస్టర్ (Block Bluster) అయ్యిందో చూశాం. ఆ సినిమా స్పూర్తితోనే అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ చేయాలి అనుకున్నారేమో. అయితే.. యానిమేషన్ మూవీ అద్భుతంగా రావాలంటే.. సరైన టీమ్ దొరకాలి. ప్రచారంలో ఉన్నట్టుగా అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ చేస్తే కనుక ఈ తరహా సినిమాలకు మరింత ఊపు రావడం ఖాయం.

