GRMB నూతన ఛైర్మన్‌గా ఏకే.ప్రధాన్‌..

  • ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జలశక్తిశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఛైర్మన్‌గా ఏకే.ప్రధాన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో ముకేష్‌కుమార్‌ సిన్హా కొనసాగారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన బోర్డు పాలక మండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ ఇంజనీర్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. గోదావరి జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల వాటాలను జీఆర్‌ఎంబీ తేలుస్తుంది. ఈ యాజమాన్య బోర్డు నదీ జలాల వివాదాలను పరిష్కరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *