WGL | స‌మ‌యపాల‌న పాటించ‌ని వైద్యుల‌పై చ‌ర్య‌లు… ఎమ్మెల్యే ముర‌ళి నాయ‌క్

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రప్రభ) : వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం సరైన పద్ధతి కాదని, స‌మ‌య‌పాల‌న పాటించ‌క‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీలు చేశారు.

ఆస్పత్రిలో 124మంది సిబ్బంది ఉండగా.. అందులో 24మంది వైద్య సిబ్బంది విధులకు 10గంటల లోపు హాజరు కావడం ఏంటని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వైద్యుల హాజరు నివేదిక ఇవ్వాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తప్పవ‌ని హెచ్చరించారు.

Leave a Reply