AP | రేషన్ బియ్యం పట్టివేత..

AP | రేషన్ బియ్యం పట్టివేత..
AP, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం పచ్చ నాగరాజు పిడిఎస్ రైస్ ను అతని ఇంటి వద్ద అక్రమంగా నిల్వ చేసాడనే సమాచారంతో ఎస్ఐ చాణిక్య మరియు సిబ్బంది, మధ్యవర్తుల సమక్షంలో అతనిని అరెస్ట్ చేశారు. 25 బియ్యపు గోను సంచులలో, ఒక్కో సంచిలో సుమారు 40 కేజీల బియ్యం కలిగి ఉన్న సుమారు 1000 కేజీల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. పచ్చ నాగరాజు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కోడూరు ఎస్ఐ చాణక్య మాట్లాడుతూ.. కోడూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోడూరు మండల పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వాలన్నారు.
