Video conference | మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

Video conference | మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
Video conference | జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్(Video conference) ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ చేపట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారుల విధుల కేటాయింపు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఇతర ప్రతి అంశంపై పర్యవేక్షించాలని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సంసిద్ధత, వార్డు వారీ ఓటరు జాబితాల ఖచ్చితత్వం, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, లాజిస్టిక్స్, భద్రతా చర్యలు, ఎన్నికల నియమావళి అమలు వంటి అంశాలపై విపులంగా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, జనగామ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, ఘనపూర్ స్టేషన్, కలెక్టరేట్ ఎ వో, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.
