Started | ఉత్సాహంగా ఆటల పోటీలు

Started | ఉత్సాహంగా ఆటల పోటీలు
- ప్రారంభమైన 6వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు
- ప్రారంభించిన మంత్రి సీతక్క
Started | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కొమరం భీమ్ మైదానం క్రీడా కోలాహలంతో నిండిపోయింది. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలను మంత్రి సీతక్క ఈ రోజు ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించిన అనంతరం ఆమె క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
క్రీడాకారుల ప్రోత్సాహం
గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, వారికి రాష్ట్ర స్థాయిలో సరైన వేదికను కల్పించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజన విద్యార్థుల, క్రీడాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలు ములుగు జిల్లాలో నిర్వహించడం ఈ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొంటూ, వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గిరిజన క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
