iBomma | ‘ఐబొమ్మ’ రవి.. బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత

iBomma | ‘ఐబొమ్మ’ రవి.. బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత

iBomma | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడు ఇమంది రవి ( Immadhi Ravi) కి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడి బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో (Five cases) బెయిల్ కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు (Court) దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి పారిపోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ ద్వారా సినిమాలు, సీరియల్స్ పైరసీ (movies and serials Piracy) చేసి ప్రసారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇమంది రవిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. బెయిల్ తిరస్కరణతో అతడు మరింత కాలం జ్యుడీషియల్ కస్టడీలో ఉండనుంది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply