WPL 2025 | బోణీ కొట్టిన యూపీ..

మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈరోజు బెంగళూరులో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలిచిన టోర్నీలో తొలి విజ‌యాన్ని అందుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. ఢిల్లీ ముందు 177 ప‌రుగులు సాధించింది.

ఇక 178 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఢిల్లీ… 144 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ (56) హాఫ్ సెంచరీతో రాణించినా… మిగతా వారు అంతగా ఆకట్టుకోలేకపోయారు.

అంత‌క ముందు బ్యాటింగ్ చేసిన యూపీ బ్యాట‌ర్ల‌లో చినెల్లే హెన్రీ (62) ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగింది. తహ్లియా మెక్‌గ్రాత్ (24), కిరణ్ నవ్‌గిరే (17), కెప్టెన్ దీప్తి శర్మ (13), మోస్త‌రు ప‌రుగులు చేసి పరువాలేద‌నిపించారు.

ఇక ఈ విజయం తో పాయింట్స్ టేబుల్లో ఆఖరి ప్లేస్ ఉన్న యూపీ వారియర్స్.. ఒక మెట్టు ఎక్కి నాలుగో స్థానికి చేరుకుంది.

Leave a Reply