Rs. 22 lakh | చేవెళ్ల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా

Rs. 22 lakh | చేవెళ్ల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తా
- మాజీ జెడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి
Rs. 22 lakh | చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల మున్సిపల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మాజీ జెడ్పీటీసీ మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు చేవెళ్ల పట్టణ కేంద్రంలోని రచ్చబండ వెనకాల తన సొంత నిధులు రూ. 22 లక్షల(Rs. 22 lakh) రూపాయలతో మినీ హాల్ కు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మినీ హాల్ మహిళలు వేద పారాయణం, విజయదశమి సందర్భంలో భజన, దుర్గామాత మాల ధరించిన భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చేవెళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి(development) చేయడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో చేవెళ్ల మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజీ, సీసీరోడ్లు నిర్మాణం గావించడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జె. లక్ష్మారెడ్డి, నాయకులు అనంతరెడ్డి, నరసింహారెడ్డి, బేగరీ వెంకటేష్, చాకలి కృష్ణ, కె. మల్లారెడ్డి దేవర వెంకటరెడ్డి, తలారి యాదయ్య, పొట్ట దయాకర్, దండు సత్యం తదితరులున్నారు.
