Khanapur Rural | వృక్షాలకు నిప్పు..

Khanapur Rural | వృక్షాలకు నిప్పు..
- భయాందోళనలో వాహనదారులు
Khanapur Rural | ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి, పాత ఎల్లాపూర్ గ్రామాల పరిధిలో ప్రధాన రహదారి పక్కన ఉన్న చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ ఘటనలో రహదారి వెంట ఉన్న రెండు పెద్ద చెట్లు లోపల నుంచి కాలిపోయి ప్రమాదకర స్థితిలో నిలిచాయి. ఈ చెట్లు ఎప్పుడు రహదారిపై కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ప్రమాదం పొంచి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్లను వెంటనే తొలగించాలని సత్తనపల్లి, పాత ఎల్లాపూర్ గ్రామాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.
