Teachers | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

Teachers | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం
Teachers | మోత్కూర్, ఆంధ్రప్రభ : సావిత్రి భాయి పూలే జయంతి, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు ప్రజాభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గ్రంధాలయంలో సావిత్రి భాయ్ పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మహిళా ఉపాధ్యాయులు భవాని, సఫియా, లావణ్య లను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాభారతి సంస్థ ప్రధాన కార్యదర్శి బోల్ల హన్మంత్, పూర్వ అధ్యక్షుడు దేవినేని అరవింద్ రాయుడు, సభ్యులు టి మనోహర చారి, ఇండ్ల రాంప్రసాద్, కాంబోజు మహేందర్, టి ఉప్పలయ్య, గాదె వెంకటేశ్వర్లు, సజ్జనం మనోహర్, మర్రి జయశ్రీ, అక్కేనపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు.
