Soft ball | సత్తా చాటిన గురుకుల విద్యార్ధులు

Soft ball | వికారాబాద్, ఆంధ్రప్రభ : అండర్ 17, 14 సాఫ్ట్ బాల్, స్టేట్ లెవెల్ ఎంపిక క్రీడాకారులను, ప్రత్యేకంగా పీడీ భాను, పీటీ భాగ్యలను ప్రిన్సిపల్ రమాదేవి, బోధన సిబ్బంది, అభినందించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల అనంతగిరిపల్లి వికారాబాద్ లోని పాఠశాల విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు. ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాల విద్యార్థులు ఏదో ఒక క్రీడలలో పాల్గొని రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికై రాష్ట్రంలోనే ప్రభంజనం సృష్టిస్తున్నారు.

గతంలో లాగానే ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో ఎంపికై రాష్ట్ర చరిత్రలోనే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. షామీర్పేటలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే టీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ అనంతగిరిపల్లి బాలుర పాఠశాల నుండి అండర్ 17 సాఫ్ట్బాల్ లో ఎస్ మోహన్ సాయి బి అరుణ్ కుమార్, ఎం పవన్, బి మనోజ్ రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కాగా, అండర్ 17 బేస్బాల్ రాష్ట్రస్థాయికి బి పవన్, సి శ్యాంప్రసాద్, ఆర్ చరణ్, బి మణికంఠ ఎంపికయ్యారు.

అండర్ 14 బేస్ బాల్ విభాగంలో కే అఖిల్, కే శివ, జై నితిన్ రాష్ట్ర స్థాయికి ఎంపికై అందరి మన్ననలను అందుకున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ద్విసంఖ్యామానంలో అనంతగిరిపల్లి బాలుర పాఠశాల నుండి ఎంపికై పాఠశాల పేరు సొసైటీ పేరును తారాస్థాయికి చేర్చుతున్నారు. వీరిని ప్రిన్సిపాల్ రమాదేవి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న పీడీ భాను, పీటీ భాగ్యలను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రిన్సిపల్ రమాదేవి మాట్లాడుతూ.. ఈ సొసైటీలో ప్రత్యేకంగా మన పాఠశాలలో విద్యార్థులకు కావలసిన వనరులను అందిస్తున్నామని విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే ఆగిపోకుండా జాతీయ స్థాయిలో రాణించడం కోసం దాంతో పాటుగా అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు మా వంతు కృషిగా కావాల్సిన సహాయ సహకారాలు వనరులను అందించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు.

విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడల వలన మానసిక ఆరోగ్యం, పేరు, ప్రతిష్టలు లభిస్తాయని క్రీడలకే వన్నె తెచ్చే విధంగా మా పాఠశాలలో ఉన్న పీఈటీ భాను, పిటీ భాగ్య నిరంతరం కృషి చేస్తున్నారని వారికి ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు. విద్యార్థులకు కావలసిన వనరులను ఏర్పాటు చేస్తామని.. మాతో కాకపోతే పై అధికారులను సంప్రదించి కావలసిన వనరులను ప్రత్యేకంగా సమకూరుస్తామని అన్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రోత్సహించుటకు వారికి కావలసిన బహుమతి ప్రధానోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.

Leave a Reply