MLA Venigandla Ramu | ప్రజల్లో వచ్చిన మార్పు చూస్తే..

MLA Venigandla Ramu | ప్రజల్లో వచ్చిన మార్పు చూస్తే..
MLA Venigandla Ramu, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. గుడివాడ రాజేంద్రనగర్ లో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. ఐక్యంగా ఉంటే ఎంత అభివృద్ధి సాధించవచ్చో గడిచిన ఏడాదిలో గుడివాడ ప్రజలు చూపించారన్నారు.
ప్రజల్లో వచ్చిన మార్పు చూస్తే.. తనకు ఎంతో సంతోషంగా ఉందని, 20 ఏళ్లలో ఏర్పడిన సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే రాము తెలియచేశారు. కొత్త ఏడాదిలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆ భగవంతున్నీ ప్రార్థిస్తున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే రాము గుడివాడ నియోజకవర్గ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు.
