Prabhas | అంచనాలు పెంచేసిన రాజాసాబ్ ట్రైలర్

Prabhas | అంచనాలు పెంచేసిన రాజాసాబ్ ట్రైలర్

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ భారీ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్(A big movie in the horror comedy genre) లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. రాజా సాబ్ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి సందడిని రెట్టింపు(Double the excitement of Sankranti) చేసేందుకు జనవరి 9న రాజా సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ 2.ఓ రిలీజ్ చేశారు. మరి.. రాజాసాబ్ ట్రైలర్ 2.ఓ రియల్ టాక్ ఏంటి..?

Prabhas | రాజాసాబ్ సాహసం..

Prabhas

రాజా సాబ్ ట్రైలర్ 2.ఓ ఎలా ఉందో చూస్తే.. గంగమ్మ (జరీనా వాహబ్) ముద్దుల మనవడు రాజా సాబ్ (ప్రభాస్). అన్నీ మర్చిపోయే గంగమ్మ తన భర్త (సంజయ్ దత్)ను మర్చిపోలేక పోతుంది. ఓ మిస్టరీగా మారిన తాతను కలిసే సాహసానికి రాజాసాబ్ రెడీ(Rajasaab is ready) అవుతాడు. అడుగు అడుగునా.. ప్రమాదాలు నిండి ఉన్న మయసభ లాంటి తాత భారీ బంగ్లాలో అడుగుపెడతాడు రాజాసాబ్. అక్కడకు వెళ్లిన వారిని ఎవరిని ఎలా వేటాడాలో డిజైన్(Design in Vada) చేసి పెడతాడు తాత. హిప్టాటిజంతో పాటు దుష్ట శక్తులను శాసించగల తాత.. రాజా సాబ్, అతనితో వచ్చిన వారిని ఎలా ఇబ్బంది పెట్టాడు ? తాత సృష్టించిన ప్రమాదాల నుంచి రాజాసాబ్ ఎలా బయటపడ్డాడు ? తాను వెళ్లిన మిషన్ ను రాజా సాబ్ కంప్లీట్(Raja Saab Complete) చేసుకున్నాడా? లేదా ? అనేదే రాజాసాబ్ స్టోరీ అని తెలస్తుంది.

Prabhas | సరికొత్త ప్రపంచం..

Prabhas

దేవనగర సంస్థ జమీందారిణి గంగాదేవి, సాధారణ మధ్య తరగతి గంగమ్మగా ఎందుకు జీవిస్తోంది ? అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది(The trailer is impressive). రాజా సాబ్ గా ప్రభాస్ స్టన్నింగ్ పర్ ఫార్మెన్స్ చేశారు. ఆయన కనిపించిన రెండు డిఫరెంట్ మేకోవర్స్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రాండ్ మేకింగ్, సర్ ప్రైజింగ్ రైటింగ్, హై క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ తో అద్భుతమైన రాజాసాబ్(Excellent Rajasaab) ప్రపంచాన్ని సృష్టించారు డైరెక్టర్ మారుతి. మూవీ మేకింగ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అల్టిమేట్ ప్యాషన్ మరోసారి ఈ ట్రైలర్ తో ప్రూవ్ అవుతోంది. ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్యాకేజ్ చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్ని రాజాసాబ్ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనే ఫీలింగ్ క్రియేట్(Create a feeling) చేయడంతో ట్రైలర్ అదిరింది.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా ఉంటుందనే టాక్ వచ్చింది. మరి.. రాజాసాబ్ థియేటర్ లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

CLICK HERE TO READ లెనిన్ కథ ఇదే..

CLICK HERE TO READ MORE

Leave a Reply