visited | గ్రామానికో పోలీస్‌..

visited | గ్రామానికో పోలీస్‌..

  • స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ చూపాలి
  • పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు

visited | నకరికల్లు, ఆంధ్రప్రభ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుని సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చొర‌వ చూపాల‌ని పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా న‌క‌రిక‌ల్లు స్థానిక పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆయ‌న సందర్శించారు . ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలలో అల్లర్లు జరగకుండా నివారించడానికి ప్రతీ గ్రామానికి ఒక్కొక్క పోలీసును కేటాయించామని తెలిపారు. అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో సత్తెనపల్లి రూరల్ సీఐ పీ.కిరణ్, ఎస్సై కే.సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply