Dhurandhar | 1000 కోట్ల దిశగా ధురంధర్

Dhurandhar | 1000 కోట్ల దిశగా ధురంధర్

ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 19 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా, హాలీవుడ్ చిత్రాల పోటీని తట్టుకుని మరీ ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషం.

ఇది కూడా చదవండి : Shivaji | మ‌హిళా క‌మిష‌న్ జోక్యం..

Dhurandhar | బాక్సాఫీస్ లెక్కలు..

డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం భారత మార్కెట్‌లో ఇప్పటివరకు రూ.598.90 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అదరగొడుతూ మొత్తంగా రూ.900 కోట్ల మార్కును దాటేసింది. ప్రస్తుత ధురంధర్ దూకుడు చూస్తుంటే, మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Dhurandhar | కథాంశం

తీవ్రవాద నెట్‌వర్క్‌లను ఛేదించే ఒక భారతీయ గూఢచారి చుట్టూ తిరిగే హై-వోల్టేజ్ ‘A’ రేటెడ్ థ్రిల్లర్ ఇది. రణవీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. ఆదిత్య ధర్ టేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతున్నాయి. సినిమాలోని మేకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Dhurandhar

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా

2025వ సంవత్సరంలో భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రం కేవలం 18 రోజుల్లోనే రూ.900 కోట్ల మార్కును దాటి, 2025లో అగ్రస్థానంలో నిలిచింది.

రిషబ్ శెట్టి స్వీయ‌దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతారా’ చిత్రం రూ.850 కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ సినిమా సత్తాను మరోసారి చాటింది. అలాగే ‘లోకాహ్ చాప్టర్ 1: చంద్ర’ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా రూ.300 కోట్ల మార్కును అధిగమించి చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ టాప్–10 జాబితాలో చోటు దక్కించుకుంది.

ఇక హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషలకు చెందిన పలు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి టాప్–10 జాబితాలో నిలిచాయి.

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి పది భారతీయ సినిమాల వివరాలు ఇవీ:

2025 టాప్-10 బాక్సాఫీస్ హిట్స్

సినిమా పేరుభాషప్రపంచవ్యాప్త వసూళ్లు (కోట్లలో)
ధురంధర్హిందీ₹901
కాంతారా: చాప్టర్ 1కన్నడ₹850 – 900
ఛావాహిందీ₹797.34
సయ్యారాహిందీ₹579.23
కూలీతమిళం₹514 – 675
మహావతార్ నరసింహబహుభాషా₹326.82
వార్ 2హిందీ₹303.22 – 351
లోకాహ్ చాప్టర్ 1: చంద్రమలయాళం₹300.08 – 303.2
దే కాల్ హిమ్ ఓజీ (OG)తెలుగు₹293.65 – 300
ఎల్2: ఎంపురాన్మలయాళం₹265 – 268

అల్టైమ్ టాప్-10లో స్థానం !

కాగా, కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.901 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల జాబితాలో 10వ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భైజాన్స‌ (రే900.90 కోట్లు) రికార్డును ర‌న్వీర్ సింగ్ ధురంధ‌ర్ అధిగమించింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ జోరు చూస్తుంటే, రాబోయే 10 రోజుల్లోనే రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ (రూ917.82 కోట్లు), షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (రూ1,148.32 కోట్లు) రికార్డులను కూడా ధురంధ‌ర్ తుడిచిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితా (టాప్ 11):

సినిమా పేరువసూళ్లు (కోట్లలో)భాషవిడుదల సంవత్సరం
దంగల్₹1,968.03 – 2,200హిందీ2016
బాహుబలి 2: ది కంక్లూజన్₹1,810.60తెలుగు2017
పుష్ప 2: ది రూల్₹1,642 – 1,800తెలుగు2024
RRR₹1,300 – 1,387తెలుగు2022
KGF: చాప్టర్ 2₹1,200 – 1,250కన్నడ2022
జవాన్₹1,148.32హిందీ2023
పఠాన్₹1,050.30హిందీ2023
కల్కి 2898 AD₹1,042 – 1,100తెలుగు2024
యానిమల్₹917.82హిందీ2023
ధురంధర్₹901హిందీ2025
భజరంగీ భైజాన్₹900.90 – 969.06హిందీ2015

ఆదిత్య ధర్ దర్శకత్వం, రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ కలెక్షన్ల వేట ఆగడం లేదు. మరి ఈ సినిమా ₹1000 కోట్ల క్లబ్‌లో ఎప్పుడు చేరుతుందో చూడాలి!

Leave a Reply