Nandyala | దత్తత తీసుకున్న దేవాలయం పునరుద్ధరణ..

Nandyala | దత్తత తీసుకున్న దేవాలయం పునరుద్ధరణ..
- కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం..
Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం పి 4 పథకం ద్వారా దత్తత తీసుకునే బంగారు కుటుంబాల నిర్దేశించడంలో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మహిళను కూడా దత్తత తీసుకున్న రు. ఇందులో భాగంగా చెంచుల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు చేపట్టారు. బండి ఆత్మకూరు మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెంచులు నివసిస్తున్న నెమళ్ళకుంట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దత్తత తీసుకున్నరు. ఇందులో భాగంగా ఆ గ్రామంలో ఉన్న దేవాలయము పూర్తి శిదిలావస్థకు చేరుకున్నాది. ఆ గ్రామంలో గిరిజనులు నివసిస్తున్న అభివృద్ధి చేయాలని సంకల్పం చేపట్టింది. దత్తత తీసుకున్న నెమలికుంట గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవాలయము పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది.

గమనించిన జిల్లా కలెక్టర్ పెద్దమ్మ తల్లి దేవాలయ పునరుద్ధనకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పునరుద్ధరణ చేసిన పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ గ్రామస్తుల మధ్యల ప్రారంభోత్సవం చేశారు. మారుమూల తండాల అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమం చేపట్టారు. దేవాలయం అభివృద్ధితోపాటు గ్రామంలోట ఉన్న గిరిజనులకు రేషన్ కార్డులు విద్యుత్ సౌకర్యం కూడా కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఈ గ్రామంలో గిరిజనులకు ఆధార్ కార్డు లేని వారికి కూడా ప్రత్యేక సెంటర్ ను ఏర్పాటు చేసి ఆధార్ కార్డులను కూడా ఇప్పించారు. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించటంతో నెమలికుంట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం. పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజల కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
