Nawabpet | ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధే లక్ష్యం

Nawabpet | నవాబ్ పేట్, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను ప్రభుత్వ సహకారంతో గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, నూతనంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అక్నాపూర్ గ్రామ సర్పంచ్ అరుణబందయ్య గౌడ్ అన్నారు. ఇవాళ మండలంలోని అక్నాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపీవో విజయ్ కుమార్ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామాభివృద్ధి ప్రతి అంశంలో తన వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని సర్పంచ్ తెలిపారు. దీనిలో మాజీ వైస్ ఎంపీపీ బందయ్య గౌడ్, మాజీ సర్పంచులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
