Narsampet | విద్యార్థుల మధ్య ఘర్షణ

Narsampet | విద్యార్థుల మధ్య ఘర్షణ

  • గిరిజన బాలుర గురుకులంలో అపస్మారక స్థితిలో విద్యార్థి

Narsampet | నర్సంపేట, ఆంధ్రప్రభ : విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో దీపక్ అనే విద్యార్థి (Student) అపస్మారక స్థితిలో పడిపోయారు. దీంతో తోటి విద్యార్థులు నర్సంపేట పట్టణంలోని ఆసుపత్రికి తరలించిన సంఘటన గురువారం రాత్రి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు చితక బాదారు. అపస్మారక స్థితిలో ఉన్న 9వ తరగతి విద్యార్థి దీపక్ ని హుటాహుటిన నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైన‌ట్లు విద్యార్ధులు తెలిపారు.

Narsampet

ఘర్షణ సమయంలో వార్డెన్ కానీ, అధ్యాపకులు కానీ అందుబాటులో లేరు. ఉన్న ఉపాధ్యాయులు (Teacher) గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యారులు ఆరోపించారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను 9వ తరగతి విద్యార్థులను విచారిస్తే ఘర్షణకు దారితీసిన పరిస్థితులు తెలుస్తాయని పలువురు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాత్రి వార్డెన్ కానీ, ఇతర అధ్యాపకులు కానీ లేకపోవడం ఆందోళనకర విషయమ‌ని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి వార్డెన్, అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను చితకబాదిన ఇంటర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply