Conference | అంత‌రించిపోనున్న బెరైటిస్ నిక్షేపాలు ..

Conference | అంత‌రించిపోనున్న బెరైటిస్ నిక్షేపాలు ..

  • ప‌దేళ్ల‌లో అంత‌రించిపోనున్న బెరైటిస్ నిక్షేపాలు ..
  • దేశానికి అలార్మింగ్ బెల్ ..
  • దేశానికి డిఫెన్స్ సెక్యూరిటీ ముఖ్యమో?
  • ఎనర్జీ సెక్యూరిటీ కూడా ముఖ్యం..
  • బెరైటిస్ మైనింగ్ తగ్గాలి..
  • ఆధార‌ప‌డిన వారికి ప్ర‌త్నామ్నాయం చూపాలి
  • భారత్ బెరైటిస్ ఎగుమతులు ఆపేయాలని
  • సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటీలో సదస్సు
  • దేశంలోని బెరైటిస్ నిక్షేపాలపై నివేదిక విడుదల
  • స‌ద‌స్సులో మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్, పాలసీ రీసెర్చ్ చైర్మెన్ డాక్టర్ జగదీప్ భట్టాచార్య

Conference | న్యూఢిల్లీ-ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : రానున్న ప‌దేళ్ల‌లో బెరైటిస్ నిక్షేపాలు అంతరించిపోతాయని నివేదికలు చెబుతున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ (Praveen Prakash) అన్నారు. బుధ‌వారం సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటీలో సదస్సు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా దేశంలోని బెరైటిస్ నిక్షేపాలపై నివేదిక విడుదల చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. బెరైటిస్ నిక్షేపాలు అంతరించిపోతే ప్రమాదమేన‌న్నారు. ప్ర‌ధానంగా ఇది దేశానికి అలార్మింగ్ బెల్ లాంటిదని చెప్పారు. అయితే, దేశానికి డిఫెన్స్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో? ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ముఖ్యమ‌ని తెలిపారు. కృష్ణ- గోదావరి బేసిన్ లో కోట్లు కోట్ల ఆయిల్ ఉండొచ్చు.. కానీ బెరైటిస్ నిక్షేపాలు లేకపోతే ఏం చేయలేమ‌న్నారు. ఇదొక ఆంధ్రప్రదేశ్ సమస్య మాత్రమే కాద‌ని, మొత్తంగా భారతదేశ సమస్యగా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

Conference | బెరైటిస్ మైనింగ్ తగ్గాలి..

బెరైటిస్ మైనింగ్ తగ్గాల‌న్నారు. దీనికి రెండు సమస్యలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఏపీ ఎండీసీ రెవెన్యూ (Revenue) తగ్గుతుందన్నారు. రెవెన్యూ పై లోన్స్ తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. అయితే, కడప, మంగం పేటలో చాలా పేద ప్రజలు దీనిపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఇందుకు కూడా పరిష్కారాలు ఉన్నాయన్నారు. బాండ్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీనిపై ఆధారపడ్డ ప్రజలకు కూడా ఉద్యోగాల క‌ల్ప‌న ఏర్పాటు చేయవచ్చ‌ని సూచించారు. ఈ సమస్యపై నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నారు. వాస్త‌వానికి పెట్రోలియం సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కిందికి వస్తుందని, ఈ క్రైసెస్ లో కూడా ఒక అవకాశం ఉందన్నారు. ఎలాగైతే భారత్ విశ్వ గురువు అవుతుంది అని చెప్పుకుంటున్నామో? ఏపీ దేశానికి గురువు అవ్వడానికి ఛాన్స్ ఉంద‌న్నారు. ప్ర‌త్యామ్నాయ అవకాశమంటే కడప స్టీల్ ప్లాంట్ యే అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సెటిల్ చేస్తే.. మన వాళ్లకు మేలు జరుగడ‌మే కాకుండా కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుందని తెలిపారు.

Conference

Conference | బెరైటిస్ నిక్షేపాలు ఆయిల్ వెలికితీతకు ముఖ్యం..

బెరైటిస్ నిక్షేపాలు ఆయిల్ వెలికితీతకు చాలా ముఖ్యమైన‌వ‌ని సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ చైర్మెన్ డాక్టర్ జగదీప్ భట్టాచార్య (Jagdeep Bhattacharya) అన్నారు. దేశంలో దాదాపు 22 బిలియన్ బ్యారెల్ ఆయిల్ డిస్కవరీ అయిందని, ఎంత ఆయిల్ ఉన్న వాటిని వెలికి తీయాలంటే కచ్చితంగా బెరైటిస్ అవసరం అని పేర్కొన్నారు. మనవద్ద ఉన్న బెరైటిస్ ను ఎగుమతి చేయడం దురదృష్టకరమ‌న్నారు. ఎగుమతుల వల్ల బెరైటిస్ నిక్షేపాలు అంతరించిపోతున్నాయన్నారు. ప్రపంచంలో చైనా అత్యధికంగా బెరైటిస్ ఎగుమతులు చేసేది, కానీ పరిస్థితులను అంచనా వేసిన చైనా ఎగుమతులు తగ్గించిందని తెలిపారు. అమెరికా వద్ద బెరైటిస్ ఉన్నప్పటికీ, భారత్ తో సహా మరికొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు. భారత్ బెరైటిస్ ఎగుమతులు ఆపేయాలని, దీనివల్ల ఈ సెక్టార్ పై ఆధారపడ్డ ప్రజలకు ఇబ్బంది త‌ప్ప‌వ‌న్నారు. కానీ బాధితులకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ఉపాధి కల్పించాలని సూచించారు.

CLICK HERE TO READ రేస్​ లో హోంభౌండ్  

CLICK HERE TO READ MORE

Leave a Reply