3D printing | త్రీడి టెక్నాలజీతో గాంధీ విగ్రహం

3D printing | త్రీడి టెక్నాలజీతో గాంధీ విగ్రహం
- విద్యార్థుల ప్రతిభను కొనియాడిన ప్రిన్సిపాల్ జుమ్లా
3D printing | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : ప్రభుత్వ ఏటీసీ భూపాలపల్లి ఇంజనీరింగ్(Engineering) కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ డిజైన్ అండ్ టెక్నీషియన్ (ఇడిటీ) విభాగం విద్యార్థులు ఆధునిక సాంకేతికతను వినియోగించి అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. ఇడిటీ ట్రైనర్ అభిలాష్ నేతృత్వంలో విద్యార్థులు సరికొత్త త్రీడి ప్రింటింగ్(3D printing) సాంకేతికతతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించారు. తాజా తరం సాంకేతికతతో చేసిన ఈ సృజనాత్మక ప్రయత్నం కళాశాల వాతావరణాన్ని కళకళలాడేలా చేసింది. ఈ విగ్రహం రూపకల్పనలో విద్యార్థులు చూపిన నైపుణ్యాన్ని చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది.

ఈసందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ జుమ్లా మాట్లాడుతూ… సాంకేతికత(technology)ను సామాజిక విలువలతో కలపడం నిజంగా ప్రశంసనీయమన్నారు. గాంధీ ఆదర్శాలు యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తి ప్రదాతలు, ఆ మహానుభావుని విగ్రహాన్ని నూతన సాంకేతికతతో తీర్చిదిద్దడం విద్యార్థుల సృజనాత్మకతకు చక్కని నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు చేయాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గాంధీ విగ్రహం ప్రదర్శన విద్యార్థుల్లో సాంకేతికతపై ఆసక్తిని మరింత పెంచిందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.
