Cereal grain | అధైర్యపడవద్దు..

Cereal grain | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో రోడ్డు పక్కన ఆరపెట్టిన వరిధాన్యం(Parboiled rice) కల్లాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. తేమ శాతం ఎంత ఉంది..? ఎన్ని రోజుల నుంచి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల(Government regulations) ప్రకారం ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్యపడవద్దు అని తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనగా(Concerned) ఉందని రైతులు ఆయనకు తెలియజేశారు.

Leave a Reply