Cyclone Dvitva | అర్ధరాత్రి నుంచి ప‌వ‌ర్ కట్

Cyclone Dvitva | అర్ధరాత్రి నుంచి ప‌వ‌ర్ కట్

  • కృష్ణపట్నం ప్ర‌జ‌ల అవ‌స్థ‌లు
  • వ‌ర్షాల‌కు కూలిన విద్యుత్ స్తంభాలు
  • పునరుద్ధరణ కానీ వైనం

Cyclone Dvitva | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : ద్విత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా విద్యుత్ సరఫరాకు అక్కడక్కడ ఆటంకం కలుగుతుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం(Muthukur Mandal) కృష్ణపట్నం గ్రామానికి మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలకు గ్రామానికి సమీపంలో విద్యుత్ స్తంభాలు(Electric poles) కూలిపోవడంతో క‌రెంట్ నిలిచి ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించ‌లేదు. ఈ విషయంపై బ్రహ్మదేవి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ ఏఈ అక్బర్‌ను ఆంధ్రప్రభ వివరణ కోర‌గా… మధ్యాహ్నం రెండు గంటల లోపల మరొక లైనుకు అనుసంధానం చేసి విద్యుత్ సరఫరా చేస్తామ‌ని తెలిపారు.

Leave a Reply