Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…

Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…

Election | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలంలోని సిద్ధులూరు క్లస్టర్(Sidduluru Cluster)లో నామినేషన్ ప్రక్రియను ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి యాస్మిన్ భాష షేక్(Yasmin Bhasha Sheikh) సందర్శించారు. ఈసందర్భంగా ఆమె ఎన్నికల(Election) సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించారు.

ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి తొందరపాటు లేకుండా విధులు నిర్వహించాల‌న్నారు. పనితీరు పరిశీలనకు ఆకస్మిక తనిఖీల బృందం వస్తుందన్నారు. విద్యుత్, మరుగుదొడ్లు, నీటి వసతి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆమె వెంట‌ పీఓ జయసుధ(PO Jayasudha), ఆర్ డి ఓ వాసు చంద్ర, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply