SCHOOL | మాస్టర్ గా మారిన కలెక్టర్..

SCHOOL | మాస్టర్ గా మారిన కలెక్టర్..
SCHOOL | ఆరిలోవ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం జిల్లా కలెక్టర్ (Collector) హరిందిర ప్రసాద్ ఉపాధ్యాయునిగా మారారు. ఎండాడ ఎంపీపీ స్కూల్ ను మంగళవారం ఆకస్మీఖ తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో రైమ్స్ చదివించారు. ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో చర్చించి పిల్లల భవిష్యత్తును ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయునిగా మారి స్కూల్ పిల్లలకు పాఠ్యాంశాలను బోధించారు.
మంచి నడవడికతో క్రమశిక్షణతో విద్యను (Education) అభ్యసించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండేందుకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదవాలని ఆయన హితభోద చేశారు. స్కూల్లో మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత, భోజనాల నాణ్యత మొదలైన అంశాల పై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ తో పాటు విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ స్కూల్ విజిట్ లో పాల్గొన్నారు.
