POLICE | ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ

POLICE | ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ


POLICE | జైనూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల (Election) సందర్భంగా ఓటర్లు ఎవరికి కూడా ప్రలోభాలకు లొంగకూడదని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో జైనూర్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులచే ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు, నాయకులు అందరూ సహకరించి ఎలాంటి గొడవలు చేయకుండా చూడాలని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సీఐ రమేష్ (CI Ramesh) కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైనూర్, సిర్పూర్( యు), లింగాపూర్, ఎస్సైలు రామకృష్ణ, ఉల్లాస్, గంగన్న, మూడు పోలీస్ స్టేషన్ల పోలీస్ సిబ్బంది, తెలంగాణ ప్రత్యేక పోలీసుల బృందం, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply